APTDC Floated EOI for Rushikonda Buildings: విశాఖ రుషికొండలో నిర్మించిన భవనాలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ భవనాలను ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రాతిపదికన లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. APTDC EOI (ఆసక్తి వ్యక్తీకరణ) కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 10లోగా ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలనిసూచించింది. గత ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.450 కోట్ల వ్యయంతో రుషికొండలో ఈ భవనాలు నిర్మించిన సంగతి తెలిసిందే.