రాష్ట్రంలో చమురు కొరత లేదని చమురు సంస్థలు ప్రకటించాయి. తెలంగాణలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ఉందంటూ వస్తున్న వార్తలన్నీ అసత్యాలు అని కొట్టిపారేశాయి. అయితే గత కొన్ని రోజులుగా.. రాష్ట్రంలో ఇంధన వినియోగం పెరిగినట్లు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే మరింత వేగంగా ఇంధనాన్ని సరఫరా చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించాయి. ఫేక్ న్యూస్ విని ప్రజలు గందరగోళానికి గురి కావద్దని సూచిస్తున్నాయి.