‘రాష్ట్ర సాధన కోసం వ్యూహ రచన చేసిన గదిలోనే.. విచారణ ఎదుర్కోవడం దురదృష్టకరం’.. కేసీఆర్ ఆవేదన..

5 months ago 24
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తుది దశకు చేరినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఎంతో మంది రాజకీయ నాయకులను, ప్రముఖులను విచారించిన సిట్ అధికారులు, నేడు మాజీ సీఎం కేసీఆర్‌ను విచారించేందుకు ఇటీవల నోటీసులు పంపారు. అయితే, నేడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ నివాసానికి చేరుకున్న కేసీఆర్‌ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. విచారణకు ముందు కేసీఆర్ భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. గతంలో రాష్ట్ర సాధన కోసం వ్యూహాలు రచించిన గదిలో ఇప్పుడు నిందితుడిలా విచారణ ఎదుర్కోవడం బాధాకరమని ఆయన అన్నారు. కాగా, విచారణ కొనసాగుతుండగా ఆయన నివాసంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Read Entire Article