రాజు గారు చాలా ఫేమస్.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు

1 year ago 22
Raghu Rama Krishna Raju: ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ కృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌తో కలిసి రఘురామ కృష్ణరాజును స్పీకర్‌ స్థానంలో కూర్చోబెట్టారు అయ్యన్నపాత్రుడు. ఈ సందర్భంగా రఘురామ గురించి చెబుతూ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చిన్న పిల్లాడికైనా రఘురామ కృష్ణరాజు గురించి తెలుసని అన్నారు. రచ్చబండ కార్యక్రమం ద్వారా చాలా పాపులర్ అయ్యారని గుర్తుచేశారు. రఘురామ కృష్ణరాజు విజయవాడలోనే జన్మించారని, విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో చదువుకొన్నారని.. రఘురారఘురామ కృష్ణరాజు తాత గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి శాసనమండలికి డిప్యూటీ ఛైర్మన్‌గా పనిచేశారని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్ సైతం రఘురామ కృష్ణరాజు గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article