తెలంగాణలోని గిరిజన యువత ఆర్థిక పురోభివృద్ధి, స్వయం ఉపాధి ధ్యేయంగా ట్రైకార్ బోర్డు రూ.2546.24 కోట్లతో భారీ వార్షిక రుణ ప్రణాళికను ఆమోదించింది. ఈ బృహత్ ప్రణాళిక ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1,36,184 మంది గిరిజన లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. మొత్తం వ్యయంలో రూ.2085 కోట్లను సబ్సిడీ రూపంలో, రూ.461.24 కోట్లను బ్యాంకు రుణాల రూపంలో అందించి వివిధ సంక్షేమ, ఉపాధి పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేయనున్నారు. ఇందులో రాజీవ్ యువవికాసం, ఇందిరా సౌరగిరి జలవికాసం, నైపుణ్యాభివృద్ధి, ఈవీ ఆటోల రెట్రోఫిటింగ్ వంటి కీలక విప్లవాత్మక కార్యక్రమాలు ఉన్నాయి.