హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ ఆర్థిక నేపథ్యం, వ్యక్తిగత ఆస్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమది ఒకప్పుడు వేల ఎకరాల భూములున్న దేశ్‌ముఖ్ కుటుంబమని, ల్యాండ్ సీలింగ్ చట్టంతో చాలా భూములు కోల్పోయామని తెలిపారు. ఎన్నికల అఫిడవిట్‌లో రూ.51 కోట్ల ఆస్తులు ప్రకటించానని, పెట్రోల్ బంకులు, కమర్షియల్ ప్రాపర్టీలు ఉన్నాయని వెల్లడించారు. తన తండ్రి కష్టపడి కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టారని చెప్పారు. ఇక తన క్రికెట్ జర్నీ గురించి కూడా కౌశిక్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు.