మృగశిర కార్తె ఎఫెక్ట్.. చెరువులో చేపలు చోరీ, 14 మంది అరెస్ట్

1 hour ago 2
మృగశిర కార్తె సందర్భంగా చెరువులో చేపలు చోరీ చేసిన ఘటన ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. సమీప గ్రామాల ప్రజలు అంతా చెరువులోకి దిగి భారీ మొత్తంలో చేపలను పట్టుకెళ్లిపోయారు. దీంతో ఆ చెరువులో చేపలు వేసుకున్న సొసైటీ సభ్యులు అక్కడికి చేరుకుని వారితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే చేపలను చోరీ చేసినందుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు 14 మందిని అరెస్ట్ చేశారు. వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
Read Entire Article