మూసీ నది సుందరీకరణకు ముహూర్థం ఖరారైంది. ఈ ఏడాది ఆగస్ట్ నుంచి మూసీ ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయి.మూసీ ప్రాజెక్టుపై చర్చించేందుకు కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ వివరాలను అధికారులు మంత్రులకు అందజేశారు. ఈ నేపథ్యంలో తొలిదశలో రూ.7,055 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఆగస్ట్ నుంచి పనులు ప్రారంభించి 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.