మునగాల ఎమ్మార్వో ఆఫీస్‌లో.. సగం మందికి పైగా సస్పెండ్ చేసిన కలెక్టర్.. కారణం ఇదే..

9 months ago 18
సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మునగాల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, సమయపాలన పాటించని అధికారులపై తీవ్ర చర్యలు తీసుకున్నారు. ఉదయం 11 గంటలు దాటినా సగానికిపైగా రెవెన్యూ సిబ్బంది విధులకు గైర్హాజరు కావడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే డిప్యూటీ తహసీల్దార్, ఇతర కీలక సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. హాజరు రిజిస్టర్‌ను స్వాధీనం చేసుకుని.. తహసీల్దార్ నుండి వివరణ కోరారు. కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయం జిల్లా అధికారులలో గుబులు పుట్టించింది.
Read Entire Article