తీన్మార్ వార్తలతో సావిత్రిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ శివజ్యోతి మరోసారి వార్తల్లో నిలిచారు. టీవీ యాంకర్‌గా, బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన ఆమె ప్రస్తుతం సినిమాల్లోనూ బిజీగా ఉన్నారు. అయితే.. తాజాగా తనపై సోషల్ మీడియాలో వచ్చిన వ్యక్తిగత విమర్శలు, అసభ్యకర వ్యాఖ్యలపై శివజ్యోతి తీవ్రంగా స్పందించారు. తనను ఎవరూ బెదిరించలేరని, నోరు మూయించలేరని స్పష్టం చేస్తూ చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఎవరేమన్నా సరే.. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తాను వీరాభిమానినని మరోసారి ప్రకటించారు.