రాష్ట్రీయ బాల పురస్కారానికి కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆరు విభాగాల్లో బాలలు ఈ పురస్కారానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 5 - 18 ఏళ్ల బాలలు అర్హలు. నేషనల్ అవార్డ్స్ పోర్టల్‌లో ఈ దరఖాస్తును నింపాల్సి ఉంది. ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. గత రెండేళ్లలో బాలల అచీవ్‌మెంట్స్ పరిగణనలోకి తీసుకుంటారు. ఉత్తమ బాలలుగా నిలిచిన వారికి డిసెంబర్ 26న వీర్ బాల దివాస్ సందర్భంగా పురస్కారాలు అందజేస్తారు.