అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించడం లేదన్న కోపంతో ఓ వ్యక్తి ఏకంగా కిరాయి గ్యాంగ్‌తోనే దాడి చేయించాడు. పక్కా ప్లాన్ ప్రకారం ఓ స్నేహితుడితో కలిసి కిడ్నాప్ ప్లాన్ రచించి.. ఆ తర్వాత నల్లమల అడవిలోకి తీసుకెళ్లి మరీ కొట్టించాడు. కిరాయి గ్యాంగ్ కూడా వాళ్లు చెప్పినట్లే దాడి చేసి నట్టడివిలో వదిలేసి వెళ్లిపోయారు. తప్పించుకుని వచ్చిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన మార్కాపురం జిల్లా కనిగిరిలో చోటుచేసుకుంది.