మారకపోతే మార్చేస్తాం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్

4 weeks ago 5
తెలంగాణలో జరుగుతున్న ఓటర్ల ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ జరిగిన టీపీసీసీ వర్చువల్ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ విషయంలో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించేది లేదని, ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. విపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీల కంటే కాంగ్రెస్ తక్కువ అవగాహన సదస్సులు నిర్వహించడాన్ని ఆయన తప్పుపట్టారు. పనితీరు మార్చుకోవడానికి నేతలకు 10 రోజుల గడువు విధించిన సీఎం.. అప్పటికీ మారకపోతే ఇంఛార్జ్‌లను మార్చేస్తామని తేల్చిచెప్పారు.
Read Entire Article