టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని నెలల క్రితం పదో తరగతి పరీక్షలకు ముందు.. మంచి మార్కులు సాధించిన విద్యార్థులను విమానంలో తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా టెన్త్ పరీక్షల్లో బాగా మార్కులు వచ్చిన విద్యార్థులను గుర్తించి.. వారిని 3 రోజుల ఢిల్లీ టూర్‌కి తీసుకెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉపరాష్ట్రపతిని కూడా కలిసే ఏర్పాట్లు చేస్తుండటం విశేషం.