తెలంగాణలో రైతులకు ఇళ్లకు సమీపంలోనే ఎరువులు అందించేందుకు మహిళా స్వయంసహాయక సంఘాలకు పంపిణీ బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో వ్యవసాయశాఖ ఈ ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్రంలోని 4.67 లక్షల మహిళా సంఘాల్లో కొన్నింటిని ఎంపిక చేసి లైసెన్సులు ఇవ్వటంతో పాటు యూరియా యాప్ వినియోగంపై శిక్షణ ఇస్తారు. సంఘాల కోసం నిర్మిస్తున్న 8,126 సొంత భవనాలలో ఎరువుల నిల్వకు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.