మహిళలకు తులం బంగారం హామీ.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన, త్వరలోనే..!

3 months ago 15
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై ఐటీ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టతనిచ్చారు. ఇప్పటికే మహాలక్ష్మి, ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ వంటి హామీలను నెరవేర్చామని.. త్వరలోనే కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం పథకాన్ని కూడా అమలు చేస్తామన్నారు. విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ.. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గం ఐక్యంగా ఉందని, ఐదేళ్లలో అన్ని వాగ్దానాలను నెరవేర్చి ప్రజల ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.
Read Entire Article