Tirumala Devotees TTD 2027 Calendars Diaries: టీటీడీ కీలక ప్రకటన చేసింది.. తిరుమల శ్రీవారి భక్తుల కోసం 2027 క్యాలెండర్లు, డైరీలను ఆన్‌లైన్‌లో అందుబాాటులోకి తీసుకొచ్చింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ క్యాలెండర్లు, డైరీలను బుక్ చేసుకోవచ్చు. తిరుపతి, తిరుమల, తిరుచానూరు, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, హిమాయత్‌నగర్‌తో పాటు విజయవాడ, చెన్నై, వెల్లూరు, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబైలోని టీటీడీ సమాచార కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు.. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది.