మహబూబ్‌నగర్ జిల్లా బైపాస్ రోడ్డులోని పాలకొండ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. అతివేగంతో వస్తున్న ఒక స్పోర్ట్స్ బైక్.. యూటర్న్ తీసుకుంటున్న కారును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులతో పాటు కారులోని ముగ్గురు ఉన్నారు. స్పోర్ట్స్ బైక్ అతివేగమే ఈ ఘోరానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇక ఓఆర్ఆర్‌పై జరిగిన ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.