నాగార్జున సాగర్ - శ్రీశైలం అభయారణ్యంలోకి ఇప్పుడు అడవి దున్నలను తీసుకొచ్చే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నల్లమలలో ప్రస్తుతం ముదురు గడ్డి ఉండటం.. జింకలు, దుప్పులు వాటిని తినలేక ఆవాసాలు మార్చుకోవడంతో పులుల ఆహారానికి ఇబ్బందిగా మారింది. దాంతో మధ్యప్రదేశ్ నుంచి అడవి దున్నలు తీసుకొస్తే అవి ముదురు గడ్డిని ఇష్టంగా తింటాయి.. ఆ తర్వాత లేత గడ్డి జింకలు తినొచ్చు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ విషయమై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రితో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది.