మదనపల్లె బాలిక హత్యాచార కేసు: కులవర్ధన్‌ది ఆత్మహత్యే.. ఏం జరిగిందో చెప్పిన ఎస్పీ

5 months ago 24
అన్నమయ్య జిల్లా మదనపల్లె ఏడేళ్ల చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కులవర్ధన్‌ది ఆత్మహత్యేనని జిల్లా ఎస్పీ వివరించారు. ప్రాథమిక విచారణలో కులవర్ధన్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు తేలిందన్నారు. రక్షక్ వాహనంలో తరలించే సమయంలో కులవర్దన్ పారిపోయాడని.. బుధవారం ఉదయం చెరువులో మృతదేహం లభ్యమైనట్లు వెల్లడించారు. హోం మంత్రి వంగలపూడి అనిత సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. పశ్చాత్తాపంతో కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
Read Entire Article