భర్త హైదరాాబాద్‌లో కష్టపడుతుంటే.. భార్య ఊర్లో ఇలా..

1 year ago 30
జోగులాంబ గద్వాల జిల్లా పాతపాలెంకు చెందిన అనిత, భర్త హైదరాబాద్‌లో ఉండగా.. పిల్లలతో స్వగ్రామంలో నివసిస్తోంది. ఈ నెల 15న ఆమె అనుమానాస్పదంగా మృతి చెందగా.. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టంలో గొంతు నులమడంతోనే మరణించినట్లు తేలింది. విచారణలో.. అనితకు గ్రామానికి చెందిన దలాయి రంగస్వామితో వివాహేతర సంబంధం ఉన్నట్లు బయటపడింది. తరచుగా జరిగే గొడవల నేపథ్యంలో రంగస్వామి, అనిత ప్రవర్తన నచ్చక ఆమెను చంపాలని పథకం వేశాడు. ఈ నెల 15న రాత్రి వాగ్వాదం తీవ్రమై, రంగస్వామి ఆమె గొంతు నులిమి చంపాడు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. పోలీసులు రంగస్వామిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.
Read Entire Article