భయపడితే రాజకీయం చేయలేం.. ఎవరికీ ఏం జరిగినా మాదే బాధ్యత : ఎంపీ మిథున్ రెడ్డి సంచలన కామెంట్స్

2 weeks ago 9
అన్నమయ్య జిల్లా చౌడేపల్లిలోని కార్యకర్తల సమావేశంలో ఎంపీ మిథన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నామినేషన్ సందర్భంగా పుంగనూరులో జరిగిన గొడవలపై ఆయన స్పందించారు. క్లిష్ట పరిస్థితుల్లో పార్టీతో నిలబడిన వారిని తాము కచ్చితంగా కాపాడుకుంటామని మాట ఇచ్చారు. భయపడితే రాజకీయం చేయలేమని.. కేసులు పెడతారు ఎదుర్కొందామని కార్యకర్తలతో అన్నారు. ఎవరికి ఏం జరిగినా మాదే బాధ్యత అని, తామే కాపాడుకుంటామని స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రత్యర్థులకు నిజంగా సత్తా ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి చూపించాలని ఛాలెంజ్ విసిరారు.
Read Entire Article