భట్టి, ఉత్తమ్‌లకు హైకోర్టులో భారీ ఊరట.. 4 ఏళ్ల క్రితం నాటి క్రిమినల్ కేసు కొట్టివేస్తూ తీర్పు

11 months ago 13
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు హైకోర్టులో ఊరట లభించింది. 2021లో వీరిద్దరిపై నమోదైన క్రిమినల్ కేసులను హైకోర్టు కొట్టివేసింది. కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ, పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు కోరుతూ కాంగ్రెస్ నేతలు ర్యాలీ చేయగా అనుమతి లేదంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ర్యాలీ వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలగలేదని కోర్టు పేర్కొంది. మాజీ ఎంపీ రంజిత్‌కుమార్‌రెడ్డిపై ఎన్నికల అక్రమాల కేసును కూడా కొట్టివేసింది.
Read Entire Article