సూర్యాపేట జిల్లా యర్కారంలో రాజకీయ కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధును ప్రత్యర్థులు శుక్రవారం రాత్రి కత్తులు, వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. ముఖం గుర్తుపట్టలేనంతగా ముక్కలుగా నరికి, శవాన్ని గోనె సంచిలో కుక్కి గ్రామ శివారులో పడేశారు. పాత హత్య కేసులలో సాక్ష్యాలు, ప్రతీకారాలు ఈ ఘాతుకానికి కారణమని తెలుస్తోంది. ఈ దారుణ హత్యతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.