భక్తులకు కడుపునిండా పౌష్టికాహారం.. వేములవాడ, ధర్మపురిలో అత్యాధునిక స్ట్రీట్ ఫుడ్ హబ్‌లు

1 month ago 7
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, ధర్మపురి పట్టణాలలో భక్తులకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా స్ట్రీట్ ఫుడ్ హబ్‌లను ఏర్పాటు చేయనున్నాయి. పీఎం స్వనిధి పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా నిర్మించనున్న 100 హబ్‌లలో తెలంగాణ నుంచి తొలి విడతగా ఐదు పట్టణాలను ఎంపిక చేశారు. మెప్మా ఆధ్వర్యంలో ఒక్కో కేంద్రానికి రూ.5 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇందులో భాగంగా అత్యాధునిక వసతులతో 50 స్టాళ్లను నిర్మించి, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గుర్తింపు పొందిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఉపాధి కల్పించనున్నారు.
Read Entire Article