బెంగాల్ సంస్థ గొప్ప మనసు.. పేద రోగుల కోసం టీటీడీకి కోట్లల్లో విరాళం..

4 weeks ago 9
తిరుమల శ్రీవారికి మరో భారీ విరాళం అందింది. బెంగాల్‌కు చెందిన ఓ సంస్థ టీటీడీ భారీ విరాళం అందించింది. కోల్‌కతా చెందిన హిమాద్రి ఫౌండేషన్ అనే సంస్థ టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు రెండున్నర కోట్ల రూపాయలు విరాళంగా అందించింది. ఫౌండేషన్ ట్రస్టీ, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును కలిసి విరాళానికి సంబంధించిన డీడీని అందించారు. ఈ సందర్భంగా దాతను బీఆర్ నాయుడు అభినందించారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ నిధులు వినియోగిస్తామన్నారు.
Read Entire Article