బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి రోడ్డు ప్రమాదం.. ఛాతీ భాగంలో తీవ్ర గాయాలు, కిమ్స్ ఆస్పత్రికి తరలింపు

2 weeks ago 4
కన్నెపల్లి పంప్‌హౌస్ పరిశీలనకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతల కాన్వాయ్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు వాహనాలు ఢీకొనడంతో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గాయపడ్డారు. ఆయన ఛాతీ భాగంలో గాయాలు కావడంతో ఆయనను కొంపల్లిలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కిమ్స్ డాక్టర్లు తెలిపారు. మరోవైపు.. జనగామ వద్ద వారి కాన్వాయ్‌ని పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
Read Entire Article