బిగ్ అలర్ట్.. ఆ జిల్లాలలో పిడుగులతో భారీ వర్షం.. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక

3 months ago 13
ఏపీలోని పలు జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ వెల్లడించింది. శుక్రవారం సాయంత్రం సమయంలో అల్లూరి, పోలవరం జిల్లాలలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే మన్యం, ఏలూరు జిల్లాలలో తేలికపాటి వర్షం కురుస్తుందని.. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు రాష్ట్రంలోని 11 జిల్లాలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటినట్లు తెలిపింది.
Read Entire Article