బాపట్ల జిల్లా రాజోలుకు చెందిన అమర్‌నాథ్ గౌడ్ కుటుంబానికి ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మరో అడుగు వేశారు. అమర్నాథ్ గౌడ్ సోదరి ఉన్నత విద్యకు అండగా ఉంటామని గతంలో మాట ఇచ్చిన అనగాని సత్యప్రసాద్.. ఈ క్రమంలోనే తాజాగా బీటెక్ చదువుతున్న ఆమెకు ల్యాప్ టాప్ అందజేశారు. అమర్నాథ్ గౌడ్ సౌదరి హేమశ్రీని ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా చదివిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రూ.10 లక్షల సాయం కూడా అందజేశారు. అలాగే సొంతింటి నిర్మాణానికి భూమి పూజ కూడా పూర్తిచేశారు.