హైదరాబాద్ శివార్లలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ వ్యవహారం తీవ్ర రణరంగంగా మారింది. శంషాబాద్ మండలం బహదూర్‌గూడ పరిధిలోని వందలాది ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం సాయుధ బలగాలను భారీగా మోహరించడంతో స్థానికంగా యుద్ధవాతావరణం నెలకొంది. తమకు న్యాయమైన పరిహార అందించి న్యాయం చేసే వరకు భూములను వదులుకునే ప్రసక్తే లేదని రైతాంగం తిరగబడటంతో.. హైడ్రా, రెవెన్యూ అధికారులు చేపట్టిన కంచె వేత ఆపరేషన్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.