హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో 'బత్తిని చేప ప్రసాదం' పంపిణీ నేటి రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. ఆస్తమా రోగులకు రేపు రాత్రి వరకు విరామం లేకుండా చేప ప్రసాదం పంపిణీ కొనసాగనుంది. దాదాపు 176 ఏళ్లుగా బత్తిని కుటుంబం ఈ సాంప్రదాయాన్ని ఉచితంగా కొనసాగిస్తోంది. బతికున్న కొర్రమీను చేప పిల్ల నోట్లో ఆయుర్వేద మూలికను ఉంచి మింగించటం దీని ప్రత్యేకత. ఈ ప్రసాదంపై సైన్స్, హేతువాదులు సంస్థల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ తరాలుగా వస్తున్న నమ్మకంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఆస్తమా బాధితులు నగరానికి చేరుకొని ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు.