కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లి శకుంతలమ్మ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. గుండెపోటు రావటంతో ఆమెకు యాంజియోప్లాస్టీ నిర్వహించిన వైద్యులు స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆవిడ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. బండి సంజయ్‌కు కీలక సూచనలు చేశారు. బయట జరుగుతున్న పరిణామాలు ఆమెకు తెలియనివ్వొద్దని.. సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.