కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌పై పోక్సో చట్టం కింద నమోదైన కేసు తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతోంది. ఒక బాలికను లైంగికంగా వేధించారనే ఆరోపణలపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయగా.. అంతకుముందే తనను హనీట్రాప్ చేసి రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని భగీరథ్ రిటర్న్ కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పందిస్తూ.. చట్టం సామాన్యుడికైనా, సంపన్నుడికైనా ఒకేలా ఉండాలని రేవంత్ ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.