బండి భగీరథ్ పోక్సో కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను బండి భగీరథ్ తరఫు లాయర్ వెనక్కి తీసుకునేందుకు మెమో ఫైల్ చేశారు. బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు అతని తరఫు లాయర్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. విచారణ వాయిదా పడింది. అయితే ఈ లోగా బండి భగీరథ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో.. ఆ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ అవసరం లేకుండా పోయింది.