బండి భగీరథ్ పోక్సో కేసుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసును గుర్తు చేసిన అసదుద్దీన్ ఓవైసీ.. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఈ కేసులో ఒక బోర్డు ఛైర్మన్ కుమారుడి ప్రమేయం ఉన్నాయని ఆరోపణలు వచ్చినా ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఇక బీఆర్ఎస్ పార్టీపై కేసీఆర్ మళ్లీ పట్టు సాధించాలని ఓవైసీ సూచించారు.