రాష్ట్రంలో పెను సంచలనం రేపుతున్న బండి భగీరథ్ పోక్సో కేసులో.. ప్రభుత్వం మరో సిట్‌ను ఏర్పాటు చేసింది. జాయింట్ సీపీ శ్వేత ఆధ్వర్యంలో ఈ సిట్ విచారణ జరపనుంది. ఈ కేసులో సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతుండటం.. బాధిత బాలిక ఫోటోలు, పేర్లు, వివరాలు, కుటుంబానికి సంబంధించిన వివరాలు బయటికి రావడంతోపాటు.. ఈ కేసులో విచారణ జరుపుతున్న జడ్జిపైనే ఆరోపణలు రావడంతో.. వీటన్నింటినీ విచారణ చేసేందుకు ఈ సిట్ దర్యాప్తు జరపనుంది.