మైనర్ బాలిక వేధింపుల నేపథ్యంలో నమోదైన పోక్సో కేసులో బండి భగీరథ్‌పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అతడు దేశం విడిచి వెళ్లకుండా విమానాశ్రయాలను అప్రమత్తం చేయడంతో పాటు హైదరాబాద్, కరీంనగర్, ఢిల్లీలలో గాలింపునకు 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. మరోవైపు తెలంగాణ హైకోర్టులో భగీరథ్‌కు ఎలాంటి ముందస్తు బెయిల్ లభించలేదు. శుక్రవారం అర్ధరాత్రి వరకు విచారణ జరిపిన న్యాయస్థానం.. మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయాన్ని వచ్చే వారానికి వాయిదా వేసింది.