బండి భగీరథ్ కేసులో మరో ట్విస్ట్ మొదలైంది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 14 మంది ఇన్‌ఫ్లూయెన్సర్లపై పోలీసులు కేసులు పెట్టారు. ఈ కేసు విషయంలో బండి భగీరథ్‌కు సపోర్ట్‌గా సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా వీడియోలు చేసినట్లు పేర్కొంటూ వారిపై కేసులు నమోదు చేశారు. భారీగా డబ్బులు తీసుకుని.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ తప్పు చేయలేదు అనే విధంగా వీరు పోస్ట్‌లు చేసినట్లు తెలుస్తోంది.