కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రారంభానికి సిద్ధమైంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వచ్చే నెల 27న జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రారంభిస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర తాజాగా జొన్నగిరిలో పర్యటించారు. టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జొన్నగిరితో పాటుగా అనంతపురం జిల్లా రామగిరిలోనూ గోల్డ్ మైన్స్ ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా బంగారు ఉత్పత్తిని ప్రారంభించేందుకు అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.