బంగారం బిస్కెట్ స్కీమ్: ఇలాంటి వాటిని అస్సలు నమ్మొద్దు..

1 year ago 48
బంగారం బిస్కెట్ స్కీమ్ పేరుతో ప్రజలను మోసం చేసిన ఘటన విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ముచ్చర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి బంగారం బిస్కెట్ పథకం పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారు. అయితే స్కీమ్ చివరకు వచ్చేసరికి నష్టాలు వస్తుందనే కారణంతో శ్రీనివాస్ బోర్డు తిప్పేశాడు. దీంతో అతని వద్ద డబ్బులు కట్టినవారందరూ లబోదిబోమంటూ అజిత్‌సింగ్ నగర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన అజిత్ సింగ్ నగర్ పోలీసులు.. శ్రీనివాస్ కోసం గాలిస్తున్నారు. అయితే ఎంత వసూలు చేశారనే వివరాలు తెలియాల్సి ఉంది.
Read Entire Article