ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠా గుట్టును తెలంగాణ ఈగల్ టీమ్ రట్టు చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలతో కలిసి చేపట్టిన భారీ ఆపరేషన్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువతకు ఉచితంగా బ్యాంకాక్ టూర్లు, ఫైవ్‌స్టార్ హోటళ్లలో వసతి, డబ్బులతో వల వేసి.. ఈ డ్రగ్స్ రాకెట్‌ను నడిపిస్తున్నట్లు గుర్తించారు. బ్యాంకాక్‌లో రూ.3 లక్షలకు కిలో గంజాయిని తెచ్చి.. ఇక్కడ రూ.కోటి వరకు విక్రయిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది.