తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో రూ.60 వేల కోట్ల పెట్టుబడితో అమెజాన్ మెగా డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం ఫ్యూచర్ సిటీలో 202 ఎకరాలు, చందన్‌వెల్లిలో 98 ఎకరాలు కలిపి 300 ఎకరాలు కేటాయించారు. రూ.125 కోట్ల ప్రోత్సాహకాలు కూడా ప్రకటించారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ డేటా సెంటర్‌తో హైదరాబాద్ దేశంలో అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ హబ్‌లలో ఒకటిగా అవతరించనుంది.