ఫుట్‌పాత్‌లపై షాపులా..? ఇక ఛాన్స్ లేదు.. రంగంలోకి హైడ్రా + జీహెచ్ఎంసీ..

1 year ago 36
హైదరాబాద్‌లో ఆక్రమణలపై హైడ్రా, జీహెచ్‌ఎంసీ ఉక్కుపాదం మోపుతున్నాయి. రాజేంద్రనగర్‌లో ఫుట్‌పాత్ ఆక్రమణలను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేశారు. మైలార్‌దేవ్‌పల్లిలో వాణిజ్య సముదాయాలపై చర్యలు తీసుకున్నారు. డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీస్ బందోబస్తుతో కూల్చివేతలు జరిగాయి. హైడ్రా ఇటీవల మియాపూర్, హైదర్ నగర్ వద్ద అక్రమ నిర్మాణాలను తొలగించింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తూ ప్రభుత్వ స్థలాలను, చెరువులను పరిరక్షిస్తోంది. ప్రతి సోమవారం ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఆక్రమణదారులపై రాజీలేని వైఖరిని అధికారులు స్పష్టం చేశారు.
Read Entire Article