రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం తరగతుల వారీగా వసూలు చేస్తున్న ట్యూషన్ ఫీజు వివరాలను స్కూల్ నోటీస్ బోర్డులు, వెబ్‌సైట్లలో తప్పనిసరిగా ప్రదర్శించాలని విద్యాశాఖ ఆదేశించింది. దీంతో పాటు గత విద్యా సంవత్సరాల ఆడిట్ రిపోర్టులను ఈ నెల 30 లోగా ఆన్‌లైన్‌లో సమర్పించాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే షోకాజ్ నోటీసులు తప్పవని హెచ్చరించారు.