ఫలితం మార్చారంటూ కన్నీరు పెట్టుకున్న మాజీ మంత్రి రోజా.. కౌంటింగ్ కేంద్రం వద్ద ధర్నా

2 days ago 5
ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. చిత్తూరు జిల్లా నగరి కౌంటింగ్ సెంటర్ దగ్గర కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. విజయపురం మండలం ఇల్లత్తూరు ఎంపీటీసీ అభ్యర్థి గెలుపు విషయంలో రగడ జరిగింది. ఎంపీటీసీ స్థానంలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారని, కానీ అధికారులు మాత్రం కావాలనే టీడీపీ అభ్యర్థి గెలిచినట్లు తప్పుగా ప్రకటించారని రోజా తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఈ విషయంలో సినీ నటి, మాజీ మంత్రి రోజా కన్నీరు పెట్టుకోవడంతో పాటు, ఆందోళనకు దిగారు. కానీ పోలీసులు ఆమె నిరసనను అడ్డుకుని, అక్కడ నుంచి తరలించారు.
Read Entire Article