ఏపీలో ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలు జరుగుతున్న ప్రచారంపై ఏపీఎస్ఆర్టీసీ స్పందించింది. ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం.. ప్రైవేటీకరణ కాదంటూ ఏపీఎస్ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఎలక్ట్రిక్ బస్సులను సమకూరుస్తోందని.. ఇది ప్రైవేటీకరణ కాదని తెలిపింది. ఈ విషయంలో ఆర్టీసీ సిబ్బందికి ఎలాంటి నష్టం కలగదని క్లారిటీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏపీకి 1050 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించినట్లు వెల్లడించింది.