ప్రార్థనా స్థలాల వద్ద లౌడ్ స్పీకర్ల కారణంగా శబ్ద కాలుష్యం ఏర్పడుతోందని.. దీనిపై చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీకి లేఖ రాశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. నియంత్రణ లేకుండా, విచ్చలవిడిగా లౌడ్ స్పీకర్లు వాడుతున్నారని.. ఫలితంగా రోగులు, వృద్ధులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని నిబంధనలు ఉల్లంఘించి లౌడ్ స్పీకర్లు ఉపయోగించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి లేఖ రాశారు.