ప్రాణ స్నేహితురాళ్ల మధ్య కులం చిచ్చు.. తెల్లారేసరికి ఒకరు మర్డర్..

11 months ago 17
చిత్తూరు రూరల్ మండలం చెర్లోపల్లిలో నివసిస్తున్న 49 ఏళ్ల సరోజ మరణం వెనుక ఉన్న రహస్యం, ఒక చిన్నారి చెప్పిన వాంగ్మూలంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 12న సరోజ తన మంచంపై మృతిచెంది ఉండగా, కుటుంబ సభ్యులు సహజ మరణంగా భావించి 13న అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, జూన్ 15న సరోజ కుమారుడు కన్నన్‌ను అదే ప్రాంతానికి చెందిన ఒక బాలుడు కలిసి, తన తల్లి నదియా సరోజకు మద్యం తాగించి, మత్తులో ఉండగా ప్లాస్టిక్ కవర్‌తో ఊపిరాడకుండా చేసి హత్య చేసిందని రహస్యంగా చెప్పాడు. కన్నన్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, చిత్తూరు తాలూకా పోలీసులు నదియాను తిరుమల వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నదియా నేరం ఒప్పుకుంది. మద్యం సేవించిన తర్వాత సరోజ తన కొడుకుకు నదియా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయమని అడగగా, కులం వేరు కావడంతో వివాదం జరిగిందని, ఆ తర్వాత మత్తులో ఉన్న సరోజను హత్య చేసినట్లు నిందితురాలు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నదియాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Entire Article