విద్వేషపూరిత కంటెంట్, మావోయిస్టులకు మద్దతు, సీఎం, డిప్యూటీ సీఎంలపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టయిన యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ ఆర్థిక వనరులపై కాకినాడ పోలీసులు ఫోకస్ పెట్టారు. ప్రశ్న యూట్యూబ్ ఛానెల్ ద్వారా లభిస్తున్న నెలకు రూ.1.50 లక్షల ఆదాయానికి సంబంధించిన రెండు బ్యాంక్ ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నిందితుడి మొబైల్ ఫోన్ నుంచి డిలీట్ చేసిన డేటాను ఫోరెన్సిక్ ల్యాబ్ రికవరీ చేయగా.. పలువురు యువతులతో సాగించిన రాసలీలలు, అశ్లీల వీడియోలు వెలుగుచూశాయి. ఈ వ్యవహారంలో ఇతరుల ప్రమేయంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.