హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి పలు కార్పొరేట్ సంస్థలు చేయూతను అందించేందుకు ముందుకు వచ్చాయి. తాజాగా సీఎంతో సమావేశమై ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రహేజా, రామ్ కీ, యశోద ఫౌండేషన్లు కలిపి.. దాదాపు రూ.100 కోట్లతో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు కొత్త బిల్డింగ్‌లు, మౌలిక వసతులు కల్పిస్తామని తేల్చి చెప్పాయి. రాష్ట్రంలో విద్యా సంస్థల అభివృద్ధి కోసం ముందుకొచ్చిన ఈ సంస్థలను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.